మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???
అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు - ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక... Continue Reading →
బొంగులో చికెన్
అప్పుడెప్పుడొ చాలా కాలం క్రితమ్ విన్నాను దీని గురించి. కానీ ఎప్పూడూ తినలేదు. ఈనాడు లో ఒక రోజు దీని గురించి రాసాడు. ఈసారి అరకు తప్పకుండా వెళ్ళాలి. ఇది తినాలి.
భూపతి పాలెం కథలు
ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి ... అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత - రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం... Continue Reading →
గోపాలరావు గారి హోటల్ – ఉగాది పచ్చడి
ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ... Continue Reading →